తెలంగాణ

ప్రజలను మభ్యపెట్టడంలో కెసిఆర్‌ది గిన్నిస్ రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 28: ప్రజలను మభ్యపెట్టడంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్సు ఇవ్వొచ్చని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి కె కృష్ణసాగరరావుఎద్దేవా చేశారు. గత రెండు రోజుల నుండి ముఖ్యమంత్రి భూ సర్వేపై పెద్ద ఎత్తున సమీక్షిస్తున్నారని, వాస్తవానికి సర్వే అనేది ఒక పెద్ద ఫార్సు అని అన్నారు. ముఖ్యమంత్రి ప్రకటనతో రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారని చెప్పారు. దేశంలో ఇలాంటి సమగ్ర సర్వే ఎవరూ నిర్వహించలేదని సిఎం చెబుతున్నారని, ఎందుకు చేయలేదో కూడా ఆలోచించాలని అన్నారు.
భూసర్వే వెనుక అనేక అంశాలున్నాయని, తేనెతుట్టె తట్టినట్టేననని తెలుసుకోవాలని, 1.12లక్షల చదరపు కిలోమీటర్ల మేర సర్వే నిర్వహించాల్సి ఉంటుందని చెప్పారు. 7కోట్ల ఎకరాల మేర సర్వే చేయాల్సి వస్తుందని, అంత పెద్ద ఎత్తున సర్వే ఎలా సాధ్యమని అన్నారు. రైతులు, పేదలు, నిరుపేదలు చాలా మంది భూమి మీద యాజమాన్య హక్కులున్నా, చాలామంది వద్ద దానికి సంబంధించిన రికార్డులు లేవని వారంతా సిఎం ప్రకటనతో భయపడుతున్నారని అన్నారు. సర్వే లక్ష్యం ఏమిటో ముఖ్యమంత్రి ముందు చెప్పాలని , ఒక్కో ఎమ్మెల్యేకు మూడు గ్రామాలు అప్పజెబుతామని అనడం కూడా అనుమానాలకు తావిస్తోందని అన్నారు. తెలంగాణలో జరిగిన భూ కబ్జాల వ్యవహారమే తేలలేదని, దానిని వదిలిపెట్టి మిగిలిన వారి మీద పడటం ఏమిటని కృష్ణసాగరరావు నిలదీశారు. సివిల్ తగాదాలున్నాయనే పేరుతో భూ సర్వే నిర్వహిస్తామని చెప్పడం సరికాదని, ఒక్క నెలలోనే భూ రికార్డులను ప్రక్షాళన చేస్తామని చెప్పడం పిట్టల దొరల మాట మాత్రమేనని, పరిపాలనా అవగాహన ఉన్న వారెవరూ అలా మాట్లాడబోరని పేర్కొన్నారు. భూ రికార్డుల పరిశీలన తిరిగి రెవిన్యూ శాఖకే అప్పగించాలని చూడటం హాస్యాస్పదమని చెప్పారు. సకల జనుల సర్వే అని చెప్పి పెద్ద ఎత్తున ఇంటింటి సర్వే చేపట్టారని దానిని ఉపయోగించిందీ లేదు, బయటపెట్టిందీ లేదని ప్రభుత్వం కాలయాపన మాటలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.