తెలంగాణ

మిషన్ భగీరథపై పలు రాష్ట్రాల అధ్యయనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 28: తెలంగాణలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకంపై పలు రాష్ట్రాలు ఆసక్తి చూపుతున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జల్ నిగమ్ మర్యాదిత్ శాక ఇంజనీర్ల బృందం మంగళవారం రాష్ట్రంలో పర్యటించి, మిషన్ భగరీథ పనులు పరిశీలిస్తారు. ఇప్పటికే ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్టల్రు తమ అధికారుల బృందాన్ని తెలంగాణకు పంపించాయి. మధ్యప్రదేశ్ బృందానికి మిషన్ భగీరథ ప్రాజెక్టు స్వరూపం, లక్ష్యాలపై అధికారులు పవర్ పాంట్ ప్రజెంటేషన్ ఇస్తారు. బుధవారం నుంచి ఈ బృందం క్షేత్ర స్థాయి పర్యటనకు వెళుతుంది. బుధవారం మెదక్- సింగూర్, గురువారం మహబూబ్‌నగర్- ఎల్లూరులో సాగుతున్న మిషన్ భగీరథ పనుల తీరును మధ్యప్రదేశ్ బృందం పరిశీలిస్తుంది.