తెలంగాణ

రబీ పంటలకు బీమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 28: రబీ సీజన్‌లో వేర్వేరు పంటలబీమాకు సంబంధించి ప్రీమియం గడువును ఉన్నతస్థాయి కమిటీ ఖరారు చేసింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సి. పార్థసారథి నేతృత్వంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పంటల బీమాపై సచివాలయంలో సోమవారం జరిగిన రాష్టస్థ్రాయి సమన్వయ కమిటీ సమావేశం సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకున్నారు. వరి, జొన్న, మొక్కజొన్న, పెసర, ఉలవ, సెనగ, మిరప, పొద్దుతిరుగుడు, వేరుసెనగ, ఉల్లి, కుసుమ పంటలను ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం కిందకు తీసుకువచ్చారు. మామిడిని మాత్రం రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీం పరిధిలో ఉండేలా నిర్ణయించారు. వనపర్తి,నాగర్‌కర్నూలు జిల్లాల్లో వేరుసెనగ, ఆదిలాబాద్, గద్వాల జిల్లాల్లో సెనగ, ఆసిఫాబాద్ జిల్లాలో జొన్న పంటలను బీమా పరిధిలోకి తీసుకువచ్చారు. వరి పంట 25 జిల్లాల్లో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కిందకు తీసుకువచ్చారు.
మామిడి పంటను రిస్ట్రక్చర్డ్ వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కిందకు తెస్తూ, అన్ని జిల్లాల్లో అమలయ్యేలా నిర్ణయించారు. కొత్తగా బీమా పరిధిలోకి తీసుకువచ్చిన కుసుమ పంటను ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కిందకు తీసుకువచ్చారు.
తెలంగాణలోని 31 జిల్లాలను ఆరు క్లస్టర్లుగా విభజించి పంటల బీమా అమలు చేయాలని నిర్ణయించారు. క్లస్టర్-1 లో ఆదిలాబాద్, మంచిర్యాల, కొమరంబీం (ఆసిఫాబాద్), జయశంకర్ భూపాల్‌పల్లి, సిద్ధిపేట జిల్లాలు ఉన్నాయి. క్లస్టర్-2 లో నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, యాదాద్రి, రంగారెడ్డి జిల్లాలను, క్లస్టర్-3లో పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, సిర్సిల్లా, జనగామ జిల్లాలను చేర్చారు. క్లస్టర్-4 లో ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాలను, క్లస్టర్-5 లో భద్రాద్రి, వరంగల్ (అర్బన్), వరంగల్ (గ్రామీణ), వనపర్తి జిల్లాలు, క్లస్టర్-6 లో మేడ్చల్, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల, వికారాబాద్,మహబూబాబాద్ జిల్లాలను చేర్చారు. మండలం యూనిట్‌గా ఉన్న ప్రాంతాల్లో గతంలో ఒక్కో మండలంలో రెండువేల ఎకరాలు ఉండగా, ప్రస్తుతం వెయ్యి ఎకరాలు ఉంటే ఒక యూనిట్‌గా పరిగణించాలని నిర్ణయించారు.
ఇవీ తేదీలు...
సెనగపంటకు 2017 నవంబర్ 30 ని ప్రీమియం చెల్లించే చివరి తేదీగా నిర్ణంయించారు. మొక్కజొన్న, మామిడి పంటలకు 2017 డిసెంబర్ 15 ను చివరి తేదీగా, మిగతా పంటలకు డిసెంబర్ 31 ని చివరిగడువుగా నిర్ణయించారు.