తెలంగాణ

రైతు ఏడిస్తే రాజ్యం బాగుపడదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేశ్వరం, ఆగస్టు 28: రంగారెడ్డి జిల్లాను కూరగాయల హబ్‌గా ప్రకటించి విమానాల ద్వారా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తామన్న ముఖ్యమంత్రి కెసిఆర్.. రైతులు పండించిన కూరగాయలను కనీసం నగరానికి తరలించడానికి బస్సు సౌకర్యం కూడా కల్పించడం లేదని బిజెపి జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు ఆరోపించారు. సోమవారం మహేశ్వరం మండలం తుక్కుగూడలో ఏర్పాటుచేసిన రైతు పంచాయతీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ వస్తే రైతు ఆత్మహత్యలు ఆగిపోతాయని అనుకొన్నాం కానీ.. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తరువాత సంవత్సరానికి వెయ్య మంది రైతులు ఆత్మహత్య చేసుకొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో కెసిఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, గిట్టుబాటు ధర కోసం ఆందోళన చేసిన రైతుల చేతులకు సంకెళ్లు వేయంచిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందని ఎద్దేవా చేశారు. పోలీసులు ఇంటికి వస్తే ఇజ్జత్ పోతుందనేకునే నిజాయతీ గల రైతు కుటుంబాలను జైళ్లకు తరలించిన విషయాన్ని మరిచిపోవద్దని అన్నారు. బంగారు తెలంగాణ సాధిస్తామని చెప్పుకొంటున్న ప్రభుత్వం.. ఆత్మహత్యలను అరికట్టడంలో వైఫల్యం చెందిందని, బంగారు తెలంగాణ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ప్రభుత్వం వచ్చిన తరువాత ఏ రైతన్నా తులం బంగారం కొన్న దాఖలాలు ఉన్నాయా? అని రైతులను అడిగారు. పచ్చని పంట పొలాల్లో ఐటి పరిశ్రమల పేరుతో కాలుష్య కారక పరిశ్రమలు నెలకొల్పితే వ్యవసాయం కుంటుపడి రైతులు వ్యవసాయాన్ని వదిలేయాల్సిన పరిస్థితి దాపురించిందని అన్నారు. రైతు కంట కన్నీరు వస్తే.. నైజాం సర్కారుకు పట్టిన గతే కెసిఆర్ ప్రభుత్వానికీ పడుతుందని హెచ్చరించారు.ప్రభుత్వాన్ని రైతులంతా సంఘటితమై నిలదీయాలని పిలుపునిచ్చారు. 2019లలో తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని.. దేశంలోనే రంగారెడ్డి జిల్లాను నెంబర్ వన్ కూరగాయల హబ్‌గా చేస్తామని రైతులకు భరోసా ఇచ్చారు.

చిత్రం..సోమవారం మహేశ్వరం మండలం తుక్కుగూడలో నిర్వహించిన
రైతు పంచాయతీ కార్యక్రమంలో మాట్లాడుతున్న బిజెపి నేత మురళీధర్‌రావు