తెలంగాణ

దోస్త్ అడ్మిషన్లకు నిబంధనల సడలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 29: ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన దోస్త్ అడ్మిషన్ల నిబంధనలను సడలించినట్టు దోస్త్ కన్వీనర్ డాక్టర్ లింబాద్రి తెలిపారు. దోస్త్ చివరి దశ అడ్మిషన్లకు మంగళవారం వరకూ అవకాశం ఇచ్చామని అన్నారు. డిగ్రీ అడ్మిషన్లకు మే14 నుండి మూడు విడతలుగా వెబ్ ఆప్షన్లలో అవకాశం కల్పించామని, 1,87,300 మంది విద్యార్థులు ఇంత వరకూ వివిధ కోర్సుల్లో చేరారని, చిన్నచిన్న కారణాలతో కొంతమంది విద్యార్థులు సీట్లు పొందలేకపోయారని, సరైన టెలిఫోన్ నెంబర్లు ఇవ్వకపోవడం, టోకెన్ నెంబర్‌లు మిస్ కావడం తదితర కారణాలతో ఇబ్బందులు ఎదురైన మాట నిజమేనని అన్నారు. 4వ దశలో ఇంకా సీట్లు కావాలనుకునే విద్యార్థులకు అవకాశం కల్పించామని ఆయన చెప్పారు. మరోసారి తాజాగా అభ్యర్థులకు రిజిస్ట్రేషన్‌కు, స్లయిడింగ్‌కూ అవకాశం ఇవ్వలేదని అన్నారు. సిబిసిఎస్ విధానం ఈ ఏడాది నుండి అమలుచేస్తున్నందున, విద్యాసంవత్సరం జాప్యం చేయడానికి అవకాశం లేదని ఆయన చెప్పారు.
పాఠశాల విద్యాశాఖ క్యాలండర్ ఖరారు
తెలంగాణ పాఠశాల విద్యాశాఖ వార్షిక క్యాలెండర్‌ను ఖరారు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం మెమో 2497ను జారీ చేసినట్టు టిటిఎఫ్ ప్రధానకార్యదర్శి రఘునందన్ తెలిపారు. హైస్కూళ్లకు ఉదయం 9.30 నుండి 4.45 వరకూ, యుపి స్కూళ్లకు 9 గంటల నుండి సాయంత్రం 4.15 వరకూ, ప్రాథమిక పాఠశాలలకు ఉదయం 9 నుండి సాయంత్రం 4 వరకూ స్కూళ్లు నిర్వహించేలా పాఠశాలల వేళలు ఖరారు చేసినట్టు ఆయన చెప్పారు. అలాగే 2017-18 విద్యాసంవత్సరం ఏప్రిల్ 12 వరకూ కొనసాగుతుందని, ఏప్రిల్ 13 నుండి వేసవి సెలవులు ఉంటాయని, తిరిగి పాఠశాలలను జూన్ 1న పున: ప్రారంభిస్తారని, పదో తరగతి పరీక్షలు మార్చి మొదటివారంలో ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. ఐచ్ఛిక సెలవులలో పాఠశాలలు పనిచేస్తాయని, 30 శాతం మంది మాత్రమే సెలవు తీసుకుని మిగిలిన 70 శాతం మంది టీచర్లు స్కూళ్లను నిర్వహించాలని పేర్కొన్నారు.