తెలంగాణ

‘మాజీ’లంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 29: వివిధ కారణాలతో తమ పార్టీని వీడిన ముఖ్య నాయకులంతా వెనక్కి రానున్నారని టి.పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. మంగళవారం భట్టివిక్రమార్క విలేఖరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ అనేక విషయాలు చెప్పారు. పార్టీని వీడిన నాయకుల్లో కొందరు వెనక్కి వస్తామన్న సంకేతాలు పంపించారని, మరి కొందరు తమతో మాట్లాడుతున్నారని ఆయన తెలిపారు. అయితే వారి పేర్లు చెప్పేందుకు నిరాకరించారు. వరంగల్‌కు చెందిన టిఆర్‌ఎస్ ముఖ్య నేత కూడా తమతో మాట్లాడారని ఆయన చెప్పారు. ప్రజా సమస్యలపై రాష్ట్రంలో పాదయాత్ర చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఇందుకు ఎఐసిసి అనుమతి కోరానని ఆయన తెలిపారు. తనతో పాటు ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా పాదయాత్రలో పాల్గొనేందుకు ముందుకు వచ్చారని ఆయన చెప్పారు.