తెలంగాణ

రామగుండంలో సోలార్ ప్లాంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 31: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో రామగుండం, మందమర్రి ఏరియాల్లో ఒక్కొక్కటి 50మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు సింగరేణి సిఎండి ఎన్.శ్రీధర్ తెలిపారు. గురువారం నాడిక్కడ సింగరేణి భవన్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసే ప్రభుత్వ సంస్థలైన ఎన్‌టిపిసి, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఇండియా సంస్థ ప్రతినిధులతో చర్చించారు.
సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమయ్యే అవకాశాలు, వ్యయం, రాబడి, తదితర అంశాలను వారు సింగరేణి సింఎండికి వివరించారు. సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు తాము గుర్తించిన ప్రాంతాలను సింగరేణి ఈ అండ్ ఎం విభాగాల అధికారులు తెలిపారు.
సోలార్ విద్యుత్ ప్లాంట్లపై సమీక్షించిన అనంతరం సిఎండి మాట్లాడుతూ తొలిదశలో రామగుండం, మందమర్రి ఏరియాల్లో గుర్తించిన ప్రదేశాల్లో 50 మెగావాట్ల సామర్ధ్యంతో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటుకు సన్నాహాలు చేయాలని ఆదేశించారు. ఈ రెండు ప్రాంతాలే కాకుండా అవకాశం ఉన్న ఇతర ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక తయారు చేయాలని అన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం, ప్రాథమిక ప్రణాళికలను అతి త్వరలో సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో సింగరేణి ఈ అండ్ ఎం ఎం డైరక్టర్ ఎస్.శంకర్, విద్యుత్ విభాగం చీఫ్ కో ఆర్డినేటర్ ఎల్.లక్ష్మీనారాయణ, పవర్ హౌజ్ వర్క్‌షాప్ జనరల్ మేనేజర్ విజయేందర్ తదితరులు పాల్గొన్నారు.