తెలంగాణ

నేటి నుండి బిజెపి విమోచన యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 31: నాటి నిజాం దురాగతాలకు, రజాకార్ల ఆకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడిన వీరుల గాథలను గుర్తుచేసుకుంటూ అందుకు సాక్షీభూతంగా నిలిచిన ప్రాంతాలను సందర్శిస్తూ మరో పక్క రాష్ట్రప్రభుత్వ మాటల గారడీని ఎండగడుతూ బిజెపి తెలంగాణ విమోచన యాత్ర శుక్రవారం నాడు ప్రారంభం కానుంది. ఏడు రోజుల పాటు 20 జిల్లాల్లో 36 నియోజకవర్గాల పరిధిలోని 105మండలాల్లో సాగుతుంది. ఈ సందర్భంగా 10 బహిరంగ సభలతో పాటు డజనుకుపైగా ర్యాలీలు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 1న బషీర్‌బాగ్ కనకదుర్గ దేవాలయం నుండి మొదలయ్యే ఈ విమోచన యాత్ర 7వ తేదీ మధ్యాహ్నం మహబూబ్‌నగర్ జిల్లా అప్పంపల్లిలో ముగుస్తుంది. ఏడో తేదీ తర్వాత అమరవీరుల కుటుంబ సభ్యులను తెలంగాణలోని అన్ని జిల్లాల్లో గుర్తించడం, వారి స్థితిగతులను అధ్యయనం చేసి వారిని ఏ విధంగా ఆదుకోవాలో కూడా బిజెపి యోచన చేయనుంది. వారం రోజుల పాటు ఈ అధ్యయనం కొనసాగించిన తర్వాత సెప్టెంబర్ 17న నిజామాబాద్‌లో పెద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ బహిరంగ సభకు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాధ్ సింగ్ హాజరవుతారు. ఈ మేరకు బిజెపి కార్యాచరణ సిద్ధం చేసింది.
రోడ్‌మ్యాప్
1వ తేదీ ఉదయం బషీర్‌బాగ్‌లో మొదలయ్యే యాత్ర ఉప్పల్, ఘటకేసర్, అన్నోజీగూడ మీదుగా భువనగిరి చేరుకుంటుంది. 2వ తేదీన ఆలేరు, స్టేషన్ ఘనాపూర్, వరంగల్, పరకాల, తొర్రూరు, తిరుమలగిరి మీదుగా ఖమ్మం వెళ్తుంది. 3వ తేదీన ఎర్రుపాలెం, దేవుని సంకీస, జనగామ చేరుకుని 4వ తేదీన భైరాన్‌పల్లి, సిద్ధిపేట, సిరిసిల్ల, వేములవాడ, 5వ తేదీన దాశరధి ఖిల్లా, కామారెడ్డి, మేడ్చెల్ చేరుకుంటుంది. 6వ తేదీన కీసర, మహేశ్వరం, షాద్‌నగర్, బాలానగర్, మహబూబ్‌నగర్ యాత్ర సాగుతుంది. 7వ తేదీన మహబూబ్‌నగర్ నుండి దేవరకద్ర, అప్పంపల్లి చేరుకుని మధ్యాహ్న భోజనం అనంతరం యాత్ర ముగుస్తుంది.
ప్రజల భావోద్వేగాలకు తాకట్టు: లక్ష్మణ్
సంతుష్టీకరణ రాజకీయాలకు, ప్రజల భావోద్వేగాలను రాష్ట్రప్రభుత్వం తాకట్టు పెడుతోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని తట్టిలేపాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన వ్యాఖ్యానించారు. గురువారం నాడు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ తెలంగాణ విమోచనకు రజాకర్లను ఎదురొడ్డి పోరాడిన సమర యోధులను స్మరించుకోవాలని అన్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నపుడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేసిన నేటి సిఎం కెసిఆర్ ఇపుడు తాను కూడా కాంగ్రెస్ నేతల మాదిరే వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.