తెలంగాణ

ఎయమ్స్‌కు నిధులు విడుదల చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,ఆగస్టు 31: భువనగిరిలో ఎయిమ్స్ ఏర్పాటుకు నిధులు విడుదల చేయాలని ఎంపి బూర నర్సయ్యగౌడ్ కేంద్ర ఆరోగ్య సంక్షేమ శాఖమంత్రి జెపి నడ్డాని కలిసి విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా గతంలో ముఖ్యమంత్రి కెసిఆర్ సైతం ఎయిమ్స్ నిధుల విడుదలపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి విజ్ఞప్తి చేసిన విషయాన్ని కేంద్రమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణలో ఎయిమ్స్ నిధుల విడుదలకు సంబంధించిన ఫైల్ ఆర్థికశాఖకు పంపామని బూర నర్సయ్యగౌడ్‌కి కేంద్రమంత్రి వివరించారు.అలాగే భువనగిరి పార్లమెంట్ నియోజక వర్గంలో రీజనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏర్పాటుపై కేంద్ర మానవ వనరులశాఖకు ఎంపి బూర నర్సయ్యగౌడ్ లేఖ రాశారు. ఈ ఇనిస్టిట్యూట్‌ను త్వరితగతిన ఏర్పాటు చేయాలని,దీనికి సంబంధించిన స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని బూర లేఖలో పేర్కొన్నారు.