తెలంగాణ

విద్యార్థినుల ఆత్మహత్యలపై హెచ్‌ఆర్‌సి సీరియస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 31: వివిధ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో చిన్నారులు ఆత్మహత్యలకు పాల్పడటంపై మానవ హక్కుల కమిషన్ గురువారం నాడు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఆత్మహత్యలకు కారణాలపై అధ్యయనం చేసి సమగ్ర నివేదిక అందించాలని తెలంగాణ ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రంజీవ్ ఆచార్యకు నోటీసులు జారీ చేసింది. తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగాయని బాలల హక్కుల సంఘం తరఫున అచ్యుతరావు మానవ హక్కుల కమిషన్ ముందు పిటీషన్ దాఖలు చేశారు. సగటున చూస్తే ప్రతి వారం ఒక విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఆయన తన పిటీషన్‌లో పేర్కొన్నారు. ఆత్మహత్యలను నిరోధించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని , తాజాగా కామారెడ్డి నిజాంసాగర్ మండలంలో 11 ఏళ్ల ఆరో తరగతి విద్యార్ధిని శెట్టి షాలిని హోం వర్కు చేయకపోతే టీచరు కొడతారని ఆత్మహత్య చేసుకుందని పేర్కొన్నారు. ఫీజు చెల్లించలేదనే కారణంతో టిసి ఇచ్చేయడంతో అంబర్‌పేట సెయింట్ ఆన్స్ స్కూల్‌లో నితిన్ జాన్సన్ ఆత్మహత్య చేసుకున్నాడని పిటీషన్‌లో ప్రస్తావించారు.