తెలంగాణ

రైళ్లలో అక్రమ రవాణాకు అడ్డుకట్ట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 31: రైళ్లలో అక్రమ రవాణాపై పోలీసులు దృష్టిసారించారు. దక్షిణ మధ్య రైల్వే అధికారులు, డిజిపి (రైల్వే భద్రత) కృష్ణప్రసాద్ గురువారం సికిందరాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. రైల్వే స్టేషన్లో భద్రతా సిబ్బంది, అధికారులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, గత రెండేళ్లుగా రైళ్లలో అక్రమంగా తరలిస్తున్న బియ్యం, మద్యం, గంజాయిలను స్వాధీనం చేసుకుని వారిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. రైల్వే స్టేషన్లు, రైళ్లలో పిక్ పాకెటింగ్‌కు పాల్పడుతున్న వారిని, ప్రయాణికులను దోచుకుంటున్న దొంగలను పట్టుకుని పలు కేసులు నమోదు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. 2210.163 కిలోల పిడిఎస్ బియ్యం పట్టుకుని 387 మందిని అరెస్టు చేసి 132 కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. రైళ్లలో అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్న 51 మందిని అరెస్టు చేసి 28 కేసులు నమోదు చేశామని, 3,876 కేజీల సాగర్ మసాలా, రూ. 60 లక్షలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లు సీజ్ చేశామన్నారు. 2015-17 వరకు మహిళా ప్రయాణికులను వేధిస్తున్న 33మందిపై కేసు నమోదు చేశామని ఆయన వెల్లడించారు. రైళ్లలో చైన్‌స్నాచింగ్‌లకు, దోపిడీకి పాల్పడుతున్న 132 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ. 1.40,840లు స్వాధీనం చేసుకున్నామన్నారు. రైల్వే భద్రతపై తగు చర్యలు తీసుకున్నామని, మహిళలు ఒంటిపై బంగారు ఆభరణాలు ధరించరాదని, కిటికీల వద్ద కూర్చోవద్దని డిజిపి కృష్ణప్రసాద్ సూచించారు. ప్రయాణికులు రైల్వే స్టేషన్లలో అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరిపైనా అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని డిజిపి కృష్ణప్రసాద్ సూచించారు. స్వచ్ఛరైల్వే, స్వచ్ఛ్భారత్ కార్యక్రమాలను నిశితంగా పర్యవేక్షించాలని ఆయన అధికారులను ఆదేశించారు. జేబు దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని, చిన్నపిల్లలను తమ వెంటే ఉండేవిధంగా చూసుకోవాలని ఆయన సూచించారు.