తెలంగాణ

11నుంచి సాయుధ పోరాట ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 31: మహత్తరంగా సాగిన తెలంగాణ సాయుధ పోరాటాన్ని నేటి తరానికి వివరించేందుకు సెప్టెంబర్ 11నుంచి 17వరకు తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు సిపిఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో సాయుధ పోరాట ఉత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 11న హైదరాబాద్‌లోని ప్రముఖ రచయిత మఖ్ధూం మొహియుద్దీన్ విగ్రహం వద్ద ఉత్సవాలను సిపిఐ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు. గురువారం నాడిక్కడ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 11న హైదరాబాద్ నుంచి నాగర్‌కర్నూలు, పెద్దకొత్తపల్లిలో అమరవీరుల స్థూపాన్ని సురవరం సుధాకర్ రెడ్డి ఆవిష్కరిస్తారని తెలిపారు. ముగింపు సమావేశం సిపిఐ రాష్ట్ర కార్యాలయం మఖ్ధుం భవన్‌లో జరుగుతుందని, ఆ సందర్భంగా విలీన ఉత్సవాలు పెద్దఎత్తున నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు.