తెలంగాణ

మహిళపై వేధింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 31: ఓ మహిళను తనతో స్నేహం చేయాలంటూ మెస్సేజ్‌లు పంపుతూ, వేధింపులకు గురిచేస్తున్న ఓ యువకుడిని షీ టీమ్స్ బృందం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించింది. ఫ్రెండ్‌షిప్ డే నాడు తాను పనిచేస్తున్న కార్యాలయానికి ఆ యువకుడు వచ్చి తోటి సిబ్బంది ముందు అవమానపరిచాడని, ఫేస్‌బుక్‌లో అసభ్య పదజాలంతో సందేశాలు పంపుతున్నాడంటూ, ఆ యువతి షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న స్పెషల్ ఇనె్వస్టిగేషన్ టీం దర్యాప్తు చేపట్టింది. యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఏ సందీప్, స్వతంత్ర చౌక్, గోదావరిఖని నివాసిగా గుర్తించారు. నిందితుడు సందీప్‌ను బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించగా, అతనిపై ఐపిసి యు/ఎస్ 354ఏ, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు అదనపు కమిషనర్ (క్రైమ్స్) తెలిపారు.