తెలంగాణ

పాడి రైతుల పట్ల ప్రభుత్వం వివక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనగిరి, ఆగస్టు 31: రాష్ట్ర ప్రభుత్వం విజయ డెయరీ పాడి రైతులు ఉత్పత్తి చేస్తున్న పాలు లీటరుకు 4 రూపాయల ప్రోత్సాహక నగదును అందజేస్తూ నల్లగొండ-రంగారెడ్డి పాడి రైతులపట్ల వివక్ష చూపుతోందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు పాడి రైతులు రాస్తారోకో చేపట్టారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో రంగారెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లాలకు చెందిన పాడిరైతులు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. పాడిరైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పట్టణంలోని పాతబస్టాండ్ నుండి ప్రారంభమైన ర్యాలీ కలెక్టరేట్ వరకు కొనసాగింది. కలెక్టర్ అనితారామచంద్రన్‌ను కలిసి తమ గోడు తెలుపుకునేందుకు వెళ్లిన రైతులకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్ జెసి కుర్చీలు ఖాళీగా దర్శనమివ్వడంతో ఆగ్రహించి జాతీయ రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి పాడిరైతుల ప్రతినిధులు నల్లబోలు శ్రీనివాస్‌రెడ్డి, కాయితి వెంకటరెడ్డి ప్రసంగిస్తూ నార్మాక్స్‌లో కొనసాగుతున్న పాలఉత్పత్తిదారులకు ప్రభుత్వం నుండి 4రూపాయల ప్రోత్సాహకాన్ని సాధించలేని నార్మాక్స్ పాలకవర్గానికి పదవులలో కొనసాగే అర్హత లేదన్నారు.

చిత్రం..యాదాద్రి భువనగిరి జిల్లాలో ర్యాలీ నిర్వహిస్తున్న పాడి రైతులు