తెలంగాణ

దీక్ష విరమించేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 1: తెలంగాణ సదరన్ డిస్కాం కార్యాలయంలో పదోన్నతుల వివాదంపై తెలంగాణ విద్యుత్ ఇంజనీర్లు ఆందోళనను రెండవ రోజు కూడా కొనసాగించారు. ఈ సందర్భంగా ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు శివాజీ మాట్లాడుతూ పదోన్నతులు ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ రివర్షన్ ఆదేశాలు ఇవ్వడం వల్ల ఏళ్లతరబడి ఇంజనీర్లుగా పనిచేస్తున్న తమకు తీవ్రమైన అన్యాయం జరిగిందన్నారు. తాము చేపట్టిన దీక్షలను కొనసాగిస్తామన్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ విద్యుత్ ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు నెహ్రూ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చి మూడు సంవత్సరాలు గడచినా విద్యుత్ సంస్ధల్లో ఉద్యోగుల విభజన పూర్తికాకుండా ఆంధ్ర ఇంజనీర్లు, ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. ఏపి విద్యుత్ సంస్ధల్లో ఉద్యోగులకు పదోన్నతులు వచ్చినా అభ్యంతరం తెలియచేయని వారు, ఇక్కడ తమకు పదోన్నతులు వస్తే అడ్డుకున్నారని ఆరోపించారు. తెలంగాణ విద్యుత్ సంస్ధల్లో ఇచ్చిన పదోన్నతులపై న్యాయస్ధానాన్ని ఆశ్రయించారని, దీని వల్ల తమ ఇంజనీర్లకు అన్యాయం జరుగుతోందన్నారు. తెలంగాణ విద్యుత్ సంస్ధలు రిలీవ్ చేసిన ఇంజనీర్లను ఆంధ్రప్రభుత్వం వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్నారు. కాగా పదోన్నతుల వ్యవహారం కోర్టు పరిధిలో విచారణలో ఉందని, విద్యుత్ ఇంజనీర్లకు వెంటనే న్యాయం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని సదరన్ డిస్కాం యాజమాన్య ప్రతినిధి తెలిపారు. ఈ విషయంలో ఇంజనీర్లు ఎటువంటి ఆందోళనకు గురి కారాదని పేర్కొన్నారు.