తెలంగాణ

సాగుతో పాటు తాగు నీటికీ ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 1: ప్రాజెక్టుల డిజైన్ ఆమోదానికి జాప్యం చేయకుండా ఉండేందుకు నిర్ణీత గడువు విధించాలని అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పిఎసి) రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఏ ప్రాజెక్టు చేపట్టినా సాగుతో పాటు తాగు నీటికీ ప్రాధాన్యం ఇవ్వాలని కమిటీ సూచించింది. శుక్రవారం పిఎసి చైర్మన్, మాజీ మంత్రి డాక్టర్ జె. గీతారెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాలులో కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నీటి పారుదల ప్రాజెక్టులు, నిమ్స్ ఆవరణలో కొత్త బ్లాకు నిర్మాణంలో జరిగిన జాప్యం వంటి అంశాలపై చర్చ జరిగింది. నీటి పారుదల ప్రాజెక్టులు చేపట్టినప్పుడు తాగు నీటి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని నిర్ణయించారు. ఏదైనా ప్రాజెక్టు కోసం డిజైన్ రూపొందించేందుకూ నిర్ణీత గడువు లేకపోవడం వల్ల జాప్యం జరుగుతున్నదని కమిటీ సభ్యులు అన్నారు. కాబట్టి గడువు విధించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని నిర్ణయించారు. నిమ్స్ ఆసుపత్రి ఆవరణలో కొత్త బ్లాకు నిర్మాణం విషయంలో జరిగిన జాప్యంపైనా చర్చ జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రుల భవనాల నిర్మాణం విషయంలో జాప్యం జరగరాదని, ఖాళీగా ఉన్న డాక్టర్ల ఉద్యోగాల భర్తీ చేపట్టాలని ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని నిర్ణయించారు.