తెలంగాణ

నిషేధిత భూ రిజిస్ట్రేషన్ల వివాదాలపై విచారణ కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 1: రాష్ట్రంలో నిషేధిత భూముల రిజిష్ట్రేషన్లకు సంబంధించి తలెత్తిన వివాదాలను పరిష్కరించేందుకు గాను తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ కమిటీకి చైర్మన్‌గా భూ పరిపాలన శాఖ కమిషనర్, సభ్యులుగా రిటైర్డు జడ్జి సయ్యద్ లతీఫ్ ఉర్ రహ్మాన్, సభ్య కన్వీనర్‌గా భూ రికార్డులు, సర్వే సెటిల్‌మెంట్ కమిషనర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీ నిర్ణయించుకున్న మేరకు సమావేశం అవుతూ, నిషేధిత భూములుగా గుర్తించబడి, రిజిష్ట్రేషన్ల సమస్యను ఎదుర్కొంటున్న వారు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి తగు పరిష్కార మార్గాన్ని చూపాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ వివాదానికి సంబంధించిన డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం కమిటీ తనకు ఉన్న అధికారాలను వినియోగించుకుని అనుకూలంగా గానీ, లేదా తిరస్కరణ, తొలగింపు, మార్పులు గానీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసే అధికారం ఉందని ప్రభుత్వం తెలిపింది.