తెలంగాణ

నవోదయ విద్యాలయాల్లో సౌరవిద్యుత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 1: దేశంలో రానున్న రోజుల్లో నవోదయ విద్యాలయాలు అన్నీ సౌరవిద్యుత్ కాంతులతో నిండనున్నాయి. సంప్రదాయ విద్యుత్ వినియోగాన్ని తగ్గించి సౌరవిద్యుత్ , ఇతర ప్రత్యామ్యాయ ఇంధన వనరులపై ఆధారపడాలని నవోదయ విద్యాలయాల సంఘటన్ భావిస్తోంది. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ సైతం నవోదయ విద్యాలయాలకు సౌరవిద్యుత్ సరఫరాకు వీలుగా అవసరమైన నిధుల కేటాయింపునకు ముందుకువచ్చింది. దేశంలో ప్రతిభాపాటవాలకు నవోదయ విద్యాలయాలు కేంద్రంగా మారడంతో వాటిని ప్రోత్సహించేందుకు కేంద్రం సత్వర చర్యలను తీసుకుంటోంది. ఈ ఏడాది నీట్‌లో 14183 మంది విద్యార్థులు మంచి ర్యాంకులను సాధించారు.కొంత మంది పూర్వ విద్యార్ధులు సైతం ముందుకు వచ్చి నవోదయాల్లో తన సేవలు అందిస్తున్నారు. వీరందరి సేవలను మరింత విస్తృతంగా పొందడం ద్వారా నవోదయాల రూపురేఖలను మార్చాలని కేంద్రం యోచిస్తోంది. ప్రపంచంలో వివిధ దేశాల్లో అత్యున్నత విద్యా ప్రమాణాలను అనుసరిస్తున్న విద్యాసంస్థలకు నవోదయ సిబ్బందిని పంపించి, వారికి శిక్షణ ఇప్పించడమేగాక, వారి అనుభవాలను సైతం తెలుసుకుని వాటిని స్థానిక అవసరాలకు వినియోగించుకోవాలని చూస్తోంది. భవిష్యత్‌లో నవోదయ విద్యాసంస్థలకు నిర్మించే కొత్త్భవనాల్లో బయోగ్యాస్ ప్లాంట్లతో పాటు సౌరవిద్యుత్ సదుపాయం, జల వినియోగ పథకాలను డిజైన్లలోనే చేర్చాలని నిర్ణయించారు. విద్యార్ధులు, టీచర్లు ఒకే చోట ఉండటం ద్వారా ఉమ్మడిగా బ్యారక్స్‌ను కేటాయించడం వల్ల ఫలితాలు ఎలా ఉంటాయో కూడా రానున్న రోజుల్లో అధ్యయనం చేయనున్నారు. అలాగే విద్యార్ధుల ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.