తెలంగాణ

సర్వేతో భూవివాదాలకు శాశ్వతంగా చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 2: కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు ఎమ్మెల్యేలు తప్ప మిగిలిన ఎమ్మెల్యేలు అంతా తమతో టచ్‌లో ఉన్నారని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. శనివారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే ప్రభుత్వం కూలిపోతుందని చెప్పిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు కోవర్టులు ఉన్నారని మాట్లాడుతున్నారని, ప్రజల తిరస్కారానికి గురైన కాంగ్రెస్ నాయకులకు ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్ధం కానీ అయోమయంలో పడిపోయారని అన్నారు. ప్రభుత్వం కూలిపోతుందని కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేసినప్పుడు చాలా మంది కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు వచ్చి టిఆర్‌ఎస్‌లో చేరారని అన్నారు. అలానే ఇప్పుడు ఇద్దరు తప్ప అంతా టచ్‌లో ఉన్నారని చెప్పారు. భట్టి విక్రమార్కకు టిఆర్‌ఎస్‌లో స్పేస్ లేదని అందుకే ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. రైతులను సంఘటిత శక్తిగా మార్చేందుకే రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. విపక్షాలకు దీనిపై అవగాహన లేక రాజకీయం చేయాలని ప్రయత్నిస్తున్నాయని రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. సమితుల ఏర్పాటులో సామాజిక సమతుల్యత పాటించేందుకే జివో 39 తీసుకు వచ్చినట్టు చెప్పారు. అసంఘటితంగా ఉన్న రైతులను సంఘటిత పరిచేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు సమితులను తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఎవరు అడ్డగించినా, కోర్టులకు వెళ్లినా ఈ ప్రక్రియ ఆగదని అన్నారు. అన్నింటినీ వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ అఖిలపక్ష సమావేశాన్ని దేని కోసం కోరుతోందని ప్రశ్నించారు. కుటుంబ వివాదాలతో కళాకారుడు సోమన్నను అరెస్టు చేశారని దీనిపై కాంగ్రెస్, టిడిపి నాయకులు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.ఈ కేసులో సాటి మహిళల బాధపై మాత్రమే నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం భార్య స్పందించారని అన్నారు.