తెలంగాణ

పంటలపై నైరుతి ప్రభావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 2: నైరుతీ రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా పంటల పరిస్థితి ఇప్పటి వరకు బాగానే ఉంది. వర్షాధార పంటలు ఇప్పటి వరకు బాగానే ఉన్నాయి. మహబూబ్‌నగర్, నిజామాబాద్, రామగుండం ప్రాంతాల్లో సాధారణం కన్నా కొద్దిగా తక్కువ వర్షపాతం నమోదైనప్పటికీ, పంటల దిగుబడిపై కొంత ప్రభావం కనిపించే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు పేర్కొన్నారు. నైరుతీరుతుపవనాల ప్రభావం తెలంగాణ రాష్ట్రంలో వచ్చేనెల చివరి వరకు ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) పేర్కొంది. పంటల పరిస్థితిపై ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ వివరాలను సేకరిస్తోంది. ఈ నెల పూర్తయితే తప్ప పంటల వాస్తవ పరిస్థితి ఎలా ఉంటుందో స్పష్టంగా తెలియదు.