తెలంగాణ

ప్రశాంతంగా బక్రీద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 2: తెలంగాణ రాష్టవ్య్రాప్తంగా బక్రీద్ పండగ ప్రశాంతంగా పూర్తయింది. ఒకవైపు గణేశ్ నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్న సమయంలోనే బక్రీద్ కూడా రావడంతో ప్రభుత్వం శాంతిభద్రతలను కాపాడేందుకు పెద్దఎత్తున చర్యలు తీసుకున్నది. మసీదుల వద్ద, గణపతి మండపాల వద్ద పెద్దఎత్తున పోలీసు దళాలను మొహరించింది. హైదరాబాద్‌తో పాటు, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్లగొండ తదితర పట్టణాల్లో పోలీసు బందోబస్తును భారీగా ఏర్పాటు చేశారు. రాష్టవ్య్రాప్తంగా మసీదుల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పండగ సందర్భంగా హైదరాబాద్‌తో పాటు వివిధ పట్టణాల్లో ముస్లింలు గొర్రెలను పెద్దఎత్తున కొనుగోలు చేశారు. ఇందుకోసం నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక టెంట్లు వేశారు. బక్రీద్ సందర్భంగా ఖుర్భానీ (బలి) ఇచ్చే జంతువుల వ్యర్థాలను సేకరించేందుకు జిహెచ్‌ఎంసి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.