తెలంగాణ

భూగర్భ జలాలు పుష్కలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 2: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ జలాల లభ్యత సంతృప్తికరంగా ఉంది. రాష్ట్రంలో 10.13 మీటర్ల లోతులో భూగర్భ జలాల లభ్యత సగటు నమోదైంది. నిరుడు ఇదే సీజన్‌లో 12.11 మీటర్ల లోతులో భూగర్భ జలాల సగటు నమోదైంది. రాష్ట్రంలో కురిసిన వర్షాలు, మిషన్ కాకతీయ వల్ల చెరువులు అభివృద్ధి చేయడం వల్ల 1.98 మీటర్లపైకి భూగర్భ జలాలు వచ్చాయి. రాష్ట్రంలో 584 మండలాల్లో భూగర్భ జల మట్టాలను నిర్ధారించే శాస్ర్తియ పద్ధతుల ద్వారా వివరాలు సేకరించినట్లు భూగర్భ జల శాఖ డైరెక్టర్ తెలిపారు.రాష్ట్రంలో 22 జిల్లాల్లో గత ఏడాదితో పోలిస్తే 0.11 మీటర్ల నుంచి 6.54 మీటర్ల వరకు నీరు పైకి వచ్చింది. జయశంకర్ భూపాలపల్లిలో కనీస స్ధాయిలో భూగర్భ జల మట్టాలు పెరిగాయి. ఇక్కడ 0.11 మీటర్ల పైకి నీరు వచ్చింది. అదే సిద్ధిపేటలో గరిష్ట స్ధాయిలవో 6.54 మీటర్లపైకి భూగర్భ జలాలు వచ్చాయి. 9 జిల్లాల్లో మాత్రం భూగర్భ జలాలు పాతాళానికి పోతున్నాయి. -0.17 మీటర్ల నుంచి -2.55 మీటర్ల లోతుకు నీరు వెళ్లినట్లు నిర్ధారించినట్లు భూగర్భ జల శాఖ పేర్కొంది.