తెలంగాణ

2016 ఎస్‌ఐ ఉద్యోగాల రాత పరీక్ష ఫలితాలు వెల్లడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 2: తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖలో సబ్ ఇన్‌స్పెక్టర్లు (ఎస్‌ఐ) పోస్టుల భర్తీకి 2016 నవంబర్ 19, 20 తేదీల్లో నిర్వహించిన తుది రాత పరీక్ష ఫలితాలను రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది. ఎన్ని పోస్టులకు ఎంతమంది అభ్యర్థులు హాజరై పరీక్ష రాశారు, కటాఫ్ మార్కుల వివరాలు, రాతపరీక్షలో ఎంపికైన వారి నెంబర్లు, తదితర వివరాలన్నీ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు వెబ్‌సైట్లో శనివారం (సెప్టెంబర్ 2) నుంచి అందుబాటులో ఉంచినట్లు బోర్డు చైర్మన్ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ ఫలితాలను వెబ్‌సైట్లో చూసుకోవచ్చని, మార్కుల మెమోరాండం కాపీని కూడా డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం కల్పించినట్లు వివరించారు. అలాగే అభ్యర్థులకు ఏదైనా అనుమానం ఉండి నివృత్తి చేసుకోవాలని అనుకుంటే తమ అభ్యంతరాలను వెబ్‌సైట్ ద్వారానే బోర్డుకు సమర్పించుకోవచ్చని తెలిపారు.
ఈ నెల 7 నుంచి 10వ తేదీ అర్థరాత్రి వరకు తమ వినతులు, లేదా ఫిర్యాదులు, అభ్యంతరాలను నమోదు చేసుకోవచ్చని వెల్లడించారు. ఇందుకు గాను ఒసి, బిసి అభ్యర్థులైతే రూ.5వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే రూ.2 వేలు ఫీజు చెల్లించి పొందవచ్చని తెలిపింది. ఈ విజ్ఞప్తులను స్వీకరించిన అనంతరం వాటిని పరిశీలించి బోర్డు అధికారులు జవాబును ఆన్‌లైన్‌లో అందించడం జరుగుతుందని వివరించారు. మొత్తం 510 ఖాళీలకు గాను 509 భర్తీ చేసినట్లు తెలిపారు. 32,682 మంది అభ్యర్ధులు చివరి రాత పరీక్షకు హాజరైనట్లు వివరించారు.