తెలంగాణ

పరిశీలనలో ముగ్గురి పేర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 2: కేంద్ర మంత్రివర్గ విస్తరణలో తెలంగాణ నుండి ఒకరికి తప్పకుండా చోటు దక్కుతుందని భావిస్తున్న తరుణంలో ఆశావహుల్లో ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి. పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి పి మురళీధరరావు, జాతీయ జలవనరుల కమిషన్ సభ్యుడు వెదిరె శ్రీరాం, శాసనసభ బిజెపి పక్ష నాయకుడు జి కిషన్‌రెడ్డి పేర్లు పార్టీ జాతీయ నాయకత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే వీరి ముగ్గురిలోనూ వెదిరె శ్రీరాం పేరు ముందున్నట్టు తెలిసింది. మంత్రివర్గ విస్తరణలో భాగంగా కేంద్ర కార్మిక మంత్రి పదవికి బండారు దత్తాత్రేయ రాజీనామా చేయడంతో తెలంగాణ నుండి ప్రాతినిధ్యం అనివార్యమైంది. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణలో పార్టీ పటిష్టం చేయాలంటే సమర్ధుడైన యువ నేతకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని అమిత్‌షా ప్రధాని నరేంద్రమోదీకి సూచించినట్టు సమాచారం. అయితే కేంద్రప్రభుత్వం పరిశీలనలో ఉన్న ముగ్గురూ ఇటు రాజ్యసభలోనూ, అటు లోక్‌సభలోనూ సభ్యులు కాకపోవడం విశేషం. రాజస్థాన్ నుండి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన ఎం వెంకయ్యనాయుడు ఉప రాష్టప్రతిగా నియమితులు కావడంతో ఆయన ఖాళీ చేసిన రాజ్యసభ సభ్యత్వం వీరిలో ఒకరికి ఇవ్వడం ద్వారా కేంద్ర మంత్రిగా కొనసాగించాలని పార్టీ యోచిస్తోంది. కిషన్‌రెడ్డి మూడు మార్లు శాసనసభ ప్రాతినిధ్యం వహించారు. కరీంనగర్ జిల్లా కోరపల్లి గ్రామానికి చెందిన మురళీధరరావు బిజెపిలో చేరకముందు స్వదేశీ జాగరణ్ మంచ్‌లో పనిచేశారు. ఆ తర్వాత ఆయన ఆర్‌ఎస్‌ఎస్, ఎబివిపిల్లో పనిచేశారు. 1987లోనే ఆయన రాజస్థాన్ ఇన్‌చార్జిగా ఎబివిపి పంపించింది. అక్కడి నుండి ఆయన జమ్మూకాశ్మీర్ వ్యవహారాలనూ పర్యవేక్షించారు. 2009లో బిజెపి అధ్యక్షుడు రాజ్‌నాధ్ సింగ్ సహాయకుడిగా వ్యవహరించారు. 2010లో పార్టీ జాతీయ కార్యదర్శి అయ్యారు. 2013లో పార్టీ ప్రధానకార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు.
ఇక వెదిరె శ్రీరాం ఖమ్మం జిల్లా పాల్వంచలో ఒకటో తరగతి నుండి నాలుగో తరగతి వరకూ చదివారు. 5వ తరగతి నుండి ఖమ్మం జిల్లా పాల్వంచలోనే శ్రీ రామకృష్ణవిద్యాలయలోనూ, ఇంటర్ హన్మకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలోనూ, బిఎస్సీ వరంగల్ ఆర్ట్సు అండ్ సైన్స్ కాలేజీలో, ఎంసిఎ ఉస్మానియా యూనివర్శిటీ వివేకానంద స్కూల్ ఆఫ్ పిజి స్టడీస్‌లో పూర్తి చేశారు. జలవనరులపై శ్రీరాం రాసిన పుస్తకాలను ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కలిసి ఆవిష్కరించారు. గుజరాత్ వాటర్ మేనేజిమెంట్ సిస్టంపై అధ్యయనం చేసి ఒక నివేదిక ఇచ్చారు. వాటర్ రిసోర్సెస్‌పై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి సలహాదారుగా కూడా వ్యవహరించారు. జాతీయ జలవనరుల విధానం -2012 రూపకల్పనలో కీలక వ్యక్తిగా వ్యవహరించారు. వెదిరె శ్రీరాంను రాజస్థాన్ నుండి రాజ్యసభకు నామినేట్ చేయాలని పార్టీ యోచిస్తోంది. గవర్నర్‌గా దత్తాత్రేయ
బండారు దత్తాత్రేయను ఈశాన్య రాష్ట్రాల్లో ఒకదానికి గవర్నర్‌గా పంపించనున్నట్టు సమాచారం. గవర్నర్‌గా నియమించిన వెంటనే సికింద్రాబాద్‌కు ఎన్నికలు నిర్వహిస్తే అక్కడి నుండి బిజెపి సీనియర్ నాయకుడు ఒకరిని ఎన్నికల బరిలో నిలపాలని కూడా పార్టీ జాతీయ నాయకత్వం యోచిస్తున్నట్టు తెలిసింది.