తెలంగాణ

కాంగ్రెస్‌కు 5 సీట్లు కూడా రావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 2: ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఐదు సీట్లు కూడా రావని, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క బోగస్ మాటలు మాట్లాడుతున్నాడని ఎంపి బాల్క సుమన్, ఎమ్మెల్సీ భానుప్రసాద్ విమర్శించారు. శనివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. మంత్రులు, టిఆర్‌ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని భట్టి విక్రమార్క చెబుతున్న మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విబేధాలు తీవ్రంగా ఉన్నాయని, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టివిక్రమార్కల మధ్య విబేధాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని చెప్పారు. 2019 వరకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిసిసి అధ్యక్షునిగా ఉంటారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ కుంతియా ప్రకటిస్తే, చాలా మంది కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే వ్యతిరేకించిన విషయం గుర్తు చేశారు. భట్టి అధికారంలోకి వస్తాం అని భ్రమల్లో ఉన్నారని 75 సీట్లు వస్తాయని అంటున్నారని , 75 కాదు కదా? ఐదు సీట్లు కూడా రావని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఇమేజ్ ఆకాశంలో ఉంటే కాంగ్రెస్ స్థానం పాతాళంలో ఉందని అన్నారు. మిషన్ భగీరథ, ప్రాజెక్టుల నిర్మాణం, సంక్షేమ పథకాలు రాష్ట్రంలో కాంగ్రెస్‌ను కనిపించకుండా చేయనున్నాయని అన్నారు.
కాంగ్రెస్ హయాంలో విద్యుత్ కోసం అన్నీ కష్టాలేనని, ఇప్పుడు వ్యవసాయానికి సైతం 24 గంటలు విద్యుత్ ఇస్తున్నట్టు చెప్పారు. పదిరికుప్పం, నీరుకొండ, కారం చేడు, చుండూరులో దళితులను ఊచకోత కోసిన టిడిపికి చెందిన రేవంత్‌రెడ్డి కూడా దళిత వ్యతిరేక పార్టీ అని టిఆర్‌ఎస్‌ను విమర్శించడం విడ్డూరంగా బాల్కసుమన్ అన్నారు.
రైతు సమన్వయ కమిటీలను కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటే ప్రజలు గ్రామ పొలిమెర వరకు వారిని తరిమి కొడతారని ఎమ్మెల్సీ భానుప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో జరిగే అభివృద్ధిని కోర్టుకు వెళ్లి అడ్డుకోవాలని ప్రయత్నించడం దారుణమని అన్నారు.