తెలంగాణ

కోవర్టులున్నారని వారే అంగీకరించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 2: టిఆర్‌ఎస్‌లో కాంగ్రెస్ పార్టీ కోవర్టులు ఉన్నారని ఆ పార్టీ నాయకులే అంగీకరించారని టి.పిసిసి ఉపాధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క అన్నారు. వ్యూహాలు తమకు ఉంటాయని ఆయన తెలిపారు. టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డికి తనకు మధ్య ఎటువంటి విభేదాలు లేవని, కలిసి పని చేస్తున్నామని ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో అన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమాగా చెప్పారు. జివో నెంబర్ 39 తీసుకుని వచ్చి గ్రామాలలో రైతుల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆయన విమర్శించారు. టిఆర్‌ఎస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదని అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు గోదావరి నదిపై ప్రాణహిత ప్రాజెక్టును 38 వేల కోట్లతో చేపట్టి 10 వేల కోట్ల వ్యయం చేయడం జరిగిందన్నారు.