తెలంగాణ

దళితుల పట్ల తీవ్ర వివక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 2: తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛ, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ముఖ్యంగా దళితుల పట్ల తెరాస ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతోందని, ఆయా వర్గాల హక్కులను హరిస్తూ వేధింపులకు గురిచేస్తోందని విమర్శించారు. అంతే కాకుండా తెరాస నేతల పంచాయతీలకు పోలీసు స్టేషన్లు వేదికగా మారాయని ఆరోపించారు. ఈ అంశాలను ప్రస్తావిస్తూ రేవంత్‌రెడ్డి శనివారం సిఎం కెసిఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన వాక్‌స్వాతంత్య్రం, మానవహక్కులు వంటివి తెలంగాణ రాష్ట్రంలో అమలు జరగడం లేదని, ఎస్సీ, ఎస్టీ, బడుగుల హక్కులను కాలరాస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఆర్మూర్‌లో దళిత యువకుడిని మీ పార్టీకి చెందిన శాసనసభ్యుడు ఒకరు లారీతో తొక్కించి చంపితే అడిగే దిక్కు లేదని, మిర్చికి ధర కావాలని అడిగితే ఖమ్మం నడిబొడ్డున గిరిజన రైతులకు సంకెళ్లు వేయండం, సిరిసిల్ల జిల్లాల్లో ఇసుక లారీలు ప్రజల ప్రాణాలు తీస్తుంటే పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. ఇలా ఒకటేంటి చాలా ప్రాంతాల్లో దళిత, గిరిజన, బడుగులపై ప్రతాపాన్ని చూపుతూ పోలీసు వ్యవస్థ ద్వారా గడీల పాలన తీసుకువచ్చేందుకు ఎందుకు ఆరాటపడుతున్నారని ప్రశ్నించారు.