తెలంగాణ

భద్రతకు ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 4: ప్రయాణికుల భద్రత, రైల్వే సమయ పాలనపై సోమవారం దక్షిణ మధ్య రైల్వే సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమావేశంలో సికిందరాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్, గుంటూరు, నాందేడ్ డివిజన్ల మేనేజర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిఎం వినోద్‌కుమార్ యాదవ్ ఆయా డివిజన్ల పరిధిలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్వచ్ఛ రైల్వే, స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని విధిగా నిర్వహించాలని సూచించారు. ప్రయాణికులకు కల్పించే సౌకర్యాలు, రైళ్లలో సౌకర్యాలు, స్టేషన్లలో పారిశుద్ధ్యం వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన అధికారులకు సూచించారు. డివిజనల్ మేనేజర్లు, అధికారులు ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించాలని, ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తూ రైల్వే భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని జిఎం వినోద్‌కుమార్ సూచించారు. ఈ సందర్భంగా 15 మంది సిబ్బందికి ‘మ్యాన్ ఆఫ్ ది మంత్’ సేఫ్టీ అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ జాన్ థామస్, చీఫ్ ఇంజనీర్ ప్రిన్సిపాల్ కెవి శివప్రసాద్, చీఫ్ ఆపరేషన్ మేనేజర్ ఎన్ మధుసూధన్‌రావు, ఫైనాన్షియల్ అడ్వైజర్ పద్మిని రాధాకృష్ణన్, చీఫ్ మెకానికల్ ఇంజనీర్ అర్జున్ ముండియా, చీఫ్ పర్సనల్ ఆఫీసర్ కెహెచ్‌కె దొర, ఆశిశ్ అగర్వాల్, ఏఏ ఫాడ్కె పాల్గొన్నారు.

చిత్రం..డివిజనల్ రైల్వే మేనేజర్ల సమావేశంలో మాట్లాడుతున్న దక్షిణ మధ్య రైల్వే
జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్