తెలంగాణ

6న కెసిఆర్‌కు కంటి ఆపరేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: కంటి శస్త్ర చికిత్స కోసం ఢిల్లీకి వచ్చిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సోమవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ నెల ఆరోతేదీన ఆయనకు శస్త్ర చికిత్స జరుగుతుంది. చంద్రశేఖరరావుసెప్టెంబర్ ఒకటో తేదీ ఢిల్లీకి వచ్చారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరిస్తున్న తరుణంలో చంద్రశేఖరరావు ఢిల్లీకి రావటం, ఆ మరుసటి రోజు ఆర్థిఖ శాఖ మంత్రి అరుణ్‌జైట్లీని కలుసుకోవటంతో టిఆర్‌ఎస్ కేంద్ర మంత్రివర్గంలో చేరుతుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. టిఆర్‌ఎస్ కేంద్ర మంత్రివర్గంలో చేరటం గురించి మాట్లాడేందుకు ముఖ్యమంత్రి ఢిల్లీకి రాలేదని, కేవలం కంటివైద్యం కోసం దేశ రాజధానికి వచ్చారని ఆ తరువాత తెలిసింది.