తెలంగాణ

24 గంటల్లో మోస్తరు వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 4: తెలంగాణలో వచ్చే 24గంటల్లో చాలా ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండి) ప్రకటించింది. చత్తీస్‌గఢ్ నుండి రాయలసీమ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడి ఉందని, దీని ప్రభావం వల్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ (ఇంచార్జి) వైకె రెడ్డి తెలిపారు. నైరుతి రుతుపవనాలు సాధారణంగా ఉన్నాయని వెల్లడించారు. సోమవారం చాలా ప్రాంతాల్లో స్వల్పంగా వర్షాలు కురిశాయి. గత 24గంటల్లో బూర్గుంపాడు (ఖమ్మం)లో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. డోర్నకల్ (వరంగల్)లో ఏడు సెంటీమీటర్లు, గంగాధర(కరీంనగర్), బోనకల్(ఖమ్మం)లో ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నల్లగొండ, రంగారెడ్డి తదితర జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి.