తెలంగాణ

యుద్ధప్రాతిపదికన రైతు సమితులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 4: రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు రైతు సమన్వయ సమితిల ఏర్పాటు యుద్ధప్రాతిపదికన జరుగుతోంది. ఈ నెల తొమ్మిది వరకు వీటిని ఏర్పాటు చేయాల్సి ఉంది. విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు తదితర వౌలిక అవసరాల కొనుగోలు కోసం ఒక్కో రైతుకు ఎకరాకు 2018-19 సంవత్సరం నుండి నాలుగువేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిధుల పంపిణీ రైతు సమన్వయ సమితిల ద్వారా కొనసాగించాలని భావిస్తున్నారు. రైతు సమన్వయ సమితుల ఏర్పాటు నాలుగు దశల్లో జరుగుతోంది. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర సమితులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రెవెన్యూ గ్రామ రైతు సమన్వయ సమితిలో 15 మంది, మండల రైతు సమన్వయ సమితిలో 24 మంది సభ్యులు ఉంటారు. వీరిలో ఒకరు కోఆర్డినేటర్‌గా ఉంటారు. ఈ రెండు స్థాయిల్లో నియామకాలను జిల్లా ఇంచార్జి మంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లు ప్రొసీడింగ్స్ జారీ చేయాలని సోమవారం జారీ అయిన జీఓలో పేర్కొన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక మంత్రిని ఇంచార్జీగా నియమించింది. ఒక్కో మంత్రి ఒకటి నుండి మూడు జిల్లాలకు ఇంచార్జీలుగా వ్యవహరిస్తున్నారు. జిల్లా స్థాయి రైతు సమన్వయ సమితిలో 24 మంది, రాష్టస్థ్రాయి సమన్వయ సమితిలో 42 మంది సభ్యులు ఉంటారు. జిల్లా సమితికి హెడ్‌గా కోఆర్డినేటర్, రాష్ట్ర సమన్వయ సమితికి చైర్మన్‌ను నియమిస్తున్నారు. సమితి సభ్యుల పేర్లను మంత్రుల సలహామేరకు జిల్లా కలెక్టర్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్‌కు పంపించాల్సి ఉంటుంది. జిల్లాల సమితిలతో పాటు రాష్టస్థ్రాయి సమితిని ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కమిషనర్ నియమిస్తూ ప్రొసీడింగ్స్ జారీ చేస్తారని జీఓలో పేర్కొన్నారు.