తెలంగాణ

ఢిల్లీ దృష్టిలో పడేందుకు గల్లీ డ్రామాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 4:తెలంగాణలో కాంగ్రెస్‌కు పట్టిన గతే బిజెపికి పడుతుందని టిఆర్‌ఎస్ నాయకులు మండిపడ్డారు. టిఆర్‌ఎస్ ఎంపి బాల్కసుమన్, ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు వేరువేరుగా జరిగిన విలేఖరుల సమావేశంలో విమర్శించారు. ఢిల్లీ దృష్టిలో పడాలని బిజెపి నాయకులు గల్లీ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మూడేళ్లయింది, అదే సమయంలో కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడింది, మూడేళ్లలో బిజెపి ప్రభుత్వం ఏం సాధించింది, తెలంగాణ బిజెపి నాయకులు కేంద్రం నుంచి తెలంగాణకు ఏం సాధించారో చెబితే బాగుంటుందని టిఆర్‌ఎస్ నాయకులు ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకుల వలెనే బిజెపి నాయకులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని అన్నారు.
తెలంగాణలో కెసిఆర్ పాలనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అభినందించారని గుర్తు చేశారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా దూసుకుపోతున్నదని, కెసిఆర్ పాలనను అనేకసార్లు ప్రధాని, పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభినందించారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి ఎన్నో అవార్డులు వచ్చాయని, తాజాగా కెటిఆర్‌కు దేశంలో అత్యంత ప్రతిభా వంతుడైన ఐటి మంత్రిగా స్కోచ్ సంస్థ అవార్డు ప్రకటించిందన్నారు. మూడేళ్ల కాలంలో బిజెపి ప్రభుత్వం ఎన్నికల హామీలు ఎన్ని నెరవేర్చిందని ప్రశ్నించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. మంత్రివర్గ విస్తరణలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు మొండి చేయి చూపిన కేంద్రాన్ని ప్రశ్నించలేక బిజెపి నాయకులు గల్లీ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.