తెలంగాణ

దళితుల ఆత్మస్థైర్యానికి చర్యలు తీసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 4: దళితులు, గిరిజనులు ఆత్మస్థైర్యం కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును కోరారు. ఈ మేరకు ఉత్తమ్‌కుమార్ రెడ్డి సోమవారం ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. మీ పాలనలో దళితులు, గిరిజనులపై నిరంతరం దాడులు, వేధింపులు, అక్రమాలు కొనసాగుతున్నాయని ఆయన విమర్శించారు. తెలంగాణ, బంగారు తెలంగాణ, ఆదర్శ తెలంగాణ, సామాజిక తెలంగాణగా గుర్తింపు పొందకుండా దళితులు, గిరిజనుల, మైనారిటీలపై దాడులకు, హత్యలకు, అణచివేతలకు అడ్డాగా మారిందని ఆయన దుయ్యబట్టారు. ఎన్నికలకు ముందు దళితుల కుటుంబాలకు మూడు ఎకరాల చొప్పున వ్యవసాయ భూమి ఇచ్చి సంపన్న రైతులుగా తయారు చేసి వారికి ఆత్మగౌరవంతో బతికేలా చేస్తామని హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. కానీ నేడు ఆ వర్గాలకు ఒక్క ఎకరా ఇవ్వలేదని, వారికి ఎలాంటి రక్షణ లేదని, హక్కులు అసలే లేవని, ఆత్మస్థైర్యంతో బతికే పరిస్థితి లేదని ఆయన తెలిపారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తనపై పోటీ చేశారన్న కక్షతో సత్యంతో పాటు మరో యువకుడు రవి అనే దళిత యువకులను హత్య చేయించారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు కానీ ఇంత వరకు దోషులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన తెలిపారు.
కరీంనగర్ జిల్లా వీణవంకలో దళిత మైనర్ బాలికపైన సామూహిక అత్యాచారం జరిగింది ఈ విషయంలో బాధితులకు భరోసా ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. దళిత రైతుల దయనీయ పరిస్థితికి అద్దం పట్టేలా నిజామాబాద్ జిల్లాకు చెందిన దళిత రైతు లింబయ్య సచివాలయం ముందే ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన తెలిపారు. రంగారెడ్డి జిల్లా తాండూరులో దళిత మైనర్ బాలికపై అత్యాచారం జరిగిందని, ఆర్మూర్ నియోజకవర్గంలోని మంథని గ్రామంలో దళితులు పంచాయతీ అభివృద్ధికి భూమి ఇవ్విలేదని వంద కుటుంబాలను బహిష్కరించారని, హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ స్కాలర్ వేముల రోహిత్ ఆత్మహత్య అంశంపై దేశమంతా స్పందించినా, మీరు కనీసం సంతాపం చెప్పలేదు, పరామర్శించలేదని ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. కనీసం ఇప్పుడైనా ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుకు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.