తెలంగాణ

మహిళల పాలిట మహాత్ముడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 11: మహిళల విద్య కోసం పోరాడిన యోధుడు మహాత్మా జ్యోతిరావుపూలే అని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్‌పిఎస్‌సి) చైర్మన్ ఘంటా చక్రపాణి కొనియాడారు. ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్న మహిళలంతా ఆయన చేసిన సేవలను గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. మహిళలకు విద్యావకాశాల కోసం పూలే ఆనాడు పోరాడ్డం వల్లనే ఈనాడు ఇంతమంది మహిళలు ఉద్యోగాల్లో స్ధిరపడ్డారని తెలిపారు. టిఎస్‌పిఎస్‌సి కార్యాలయంలో సోమవారం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతిరావుపూలే చిత్రపటానికి చక్రపాణి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయనతో పాటు కార్యదర్శి పార్వతి సుబ్రమణియన్, కమిషన్ సభ్యులు డాక్టర్ మహ్మద్ మతీనుద్దీన్ ఖాద్రీ, డాక్టర్ కె.రామమోహనరెడ్డి, మంగేరి రాజేందర్, సిహెచ్. విద్యాసాగరరావు, ప్రొ.సిహెచ్. శైలు, బి.మన్మథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, 175 సంవత్సరాల కిందటే సామాజికోద్దరణకు కంకణం కట్టుకున్న జ్యోతిరావు పూలే సదా చిరస్మరణీయుడని కొనియాడారు. సామాజిక రుగ్మతలను తొలగించేందుకు, మహిళల్లో వెనుకబాటుతనాన్ని పారద్రోలేందుకు, ఏళ్ల తరబడి పాతుకుపోయిన బూర్జువా వ్యవస్థను కూకటివేళ్లతో పెకలించేందుకు మహిళల్లో అక్షరాస్యత పెరగాలని ఆ రోజుల్లోనే గుర్తించిన మహానుభావుడు జ్యోతిరావుపూలే అని పలువురు గుర్తు చేసుకున్నారు.

chitram జ్యోతిరావు ఫూలేకి పూలమాల వేస్తున్న పిసిసి చీఫ్‌ఉత్తమ్‌కుమార్ రెడ్డి,