తెలంగాణ

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లీజును పునరుద్ధరించగలరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 11: హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని పాత గాంధీ మెడికల్ కాలేజీ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన వివాదంపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లీజు ఒప్పందాన్ని పునరుద్ధరించే అధికారం ఉంటుందా అని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని అడిగింది. గత ఉమ్మడి ఎపి ప్రభుత్వం పాత గాంధీ మెడికల్ కాలేజీకి ఉన్న 5.63 ఎకరాల స్థలాన్ని ఒక ప్రైవేటు అభివృద్ధి సంస్థకు ఎంటర్‌టైన్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు అప్పగించింది. అయితే 2006లో చేసుకున్న ఈ ఒప్పందాన్ని 2012లో ఎలాంటి అభివృద్ధి చేయనందుకు అప్పటి ప్రభుత్వం రద్దు చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా తెలంగాణ అదనపు అడ్వకేట్ జనరల్ జె.రామచంద్రరావు కోర్టుకు వివరిస్తూ అప్పటి ఉమ్మడి ఎపి ప్రభుత్వంలోని టూరిజం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చట్ట విరుద్ధంగా లీజు ఒప్పందాన్ని పునరుద్ధరించారని తెలిపారు. ఉమ్మడి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రాజీనామా చేయడం, ఆ తర్వాత రాష్టప్రతి పాలన విధించడం జరిగిందని గుర్తు చేశారు. ఆ సమయంలోనే లీజును పునరుద్ధరించడం జరిగిందని ఆయన హైకోర్టు దృష్టికి తెచ్చారు. పునరుద్ధరించడమే కాకుండా ప్రైవేటు నిర్మాణ, అభివృద్ధి సంస్థ నుంచి ప్రభుత్వానికి రావాల్సిన అన్ని రకాల వసూళ్లను మాఫీ చేశారని తెలిపారు. ఈ దశలో అభివృద్ధి కంపెనీ తరఫు న్యాయవాది మాట్లాడుతూ తమపై జరిమానా విధించడం సరికాదని, తెలంగాణ ఉద్యమ సమయంలో భూమి విలువలు పతనమయ్యాయని, ఆ కారణంగానే తమను ప్రభుత్వం కొంత ఆదుకుందని వివరించారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు ఈ కేసును మంగళవారానికి వాయిదా వేసింది.