తెలంగాణ

నేను పార్టీ మారడం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఏప్రిల్ 14: కాంగ్రెస్ పార్టీని వీడి తాను టిఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, పదవుల కోసం పార్టీ మారే తత్వం తనది కాదని సిఎల్పీ ఉపనేత, నల్లగొండ శాసన సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన నల్లగొండ బైపాస్‌లోని డాక్టర్ బిఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం పార్టీ శ్రేణులతో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సిఎం కెసిఆర్ ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ బాగుందన్నందుకే తాను పార్టీ మారుతున్నట్లుగా తప్పుడు ప్రచారం చోటుచేసుకుందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు మంత్రి పదవిని సైతం వదిలేసిన తనకు పదవులు గడ్డిపోచతో సమానమన్నారు. తాను అమెరికా వెళ్లిన సందర్భంలో నల్లగొండ మున్సిపల్ చైర్ పర్సన్ పార్టీ మారడం, తన పార్టీ మార్పు పట్ల తప్పుడు ప్రచారానికి దారితీసిందన్నారు. పార్టీ కౌన్సిలర్లు, కార్యకర్తలు ఎవరు కూడా ఈ పరిణామాల పట్ల అధైర్యపడవద్దని, భవిష్యత్ కాంగ్రెస్ పార్టీదేనన్నారు. రైతుల కళ్లలో ఆనందం చూసేందుకే తాను 2 వేల కోట్లతో ఎస్‌ఎల్‌బిసి, 700 కోట్లతో ఉదయ సముద్రం ప్రాజెక్టుల నిర్మాణాలకు కృషి చేశానన్నారు.