తెలంగాణ

రేపటినుంచే స్కూళ్లకు సెలవులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 14: తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత కారణంగా పాఠశాలలకు విద్యా వార్షిక ప్రణాళికను మరోమారు సవరించింది. ఈ నెల 16వ తేదీ నుండి పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. తిరిగి విద్యాసంవత్సరం జూన్ 13న ప్రారంభం అవుతుందని విద్యాశాఖాధికారులు తెలిపారు. ముందుగా అనుకున్న షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 24 వరకూ స్కూళ్లు పనిచేయాలి, కాని వారం రోజులు ముందుగానే స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. వడగాడ్పుల సమయంలో పనికి ఆహారం పథకం కింద కార్మికులు సైతం పనిచేయకుండా చూడాలని, వడదెబ్బకు గురికాకుండా చర్యలు చేపట్టాలని ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది, అయితే స్కూళ్లు మాత్రం యధావిధిగా పనిచేయడాన్ని గమనించిన ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
రామయ్య ఐఐటి శిక్షణకు నేడు పరీక్ష
ఐఐటి శిక్షణలో ప్రఖ్యాతిగాంచిన చుక్కా రామయ్య స్టడీసర్కిల్‌లో ప్రవేశానికి శుక్రవారం నాడు పరీక్ష జరగనుంది. పరీక్ష ఉదయం 9 గంటలకు మొదలవుతుందని, అయితే 10 గంటలకు తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్‌శర్మ ఉస్మానియా విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రంలో జరిగే పరీక్ష తీరును పరిశీలిస్తారని చుక్కారామయ్య తెలిపారు.