తెలంగాణ

నేరెళ్ల బాధితులకు చికిత్స అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 12: నేరేళ్ల బాధితులకు ప్రభుత్వం వరంగల్‌లోని ఎంజిఎం ఆస్పత్రిలో చికిత్స అందించాలని హైదరాబాద్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ రమేష్ రంగనాథన్, జస్టీస్ జె ఉమాదేవిలతో కూడిన డివిజన్ బెంచ్ గడ్డం లక్ష్మణ్ దాఖలు చేసిన పిల్‌ను విచారించారు. గ్రామానికి చెందిన కొందరు యువకులు నెరెళ్ల గ్రామంలో లారీని దగ్దం చేశారని, ఆ సందర్భంగా పోలీసులు లాఠీ చార్జీ చేసినట్టు తెలంగాణ అడ్వకేట్ జనరల్ డి ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. బాధితులు నిమ్స్‌కు వెళితే డాక్టర్లు చికిత్స అందంచడానికి నిరాకరించారని, అదే విధంగా హైదరాబాద్‌లో ప్రైవేటు ఆస్పత్రులు కూడా చికిత్స అందించలేదని, దాంతో కరీంనగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు బాధితుల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. ఎంత మంది బాధితులకు చికిత్స అవసరం అని బెంచ్ ప్రశ్నించగా, ఇద్దరు బాధితులకు ఇప్పటి కన్నా మెరుగైన చికిత్స అవసరం అని న్యాయవాది తెలిపారు. ఇద్దరు బాధితులకు ఎంజిఎంలో చికిత్స అందించాలని కోర్టు ఆదేశించి, కేసును వాయిదా వేశారు.