తెలంగాణ

రాజన్న ముంగిట్లో.. నేడు సీతారాముల పెళ్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేములవాడ, ఏప్రిల్ 14: హిందూ సమాజంలో శ్రీ సీతారాముల పెళ్లికి అత్యంత విశిష్టమైన ప్రాధాన్యత ఉంది. కమనీయమైన, రమణీయమైన సీతారాముల కళ్యానోత్సవాన్ని వాల్మీకి తన శ్రీమద్రామాయణంలో మహాద్భుతంగా, అపురూపంగా మనోహరంగా వర్ణించారు.దుర్ముఖి నామ సంవత్సరంలో శ్రీ రాముడు చైత్ర శుద్ద నవమినాడు పునర్వసు నక్షత్రయుక్త కర్కాటక లగ్నంలో జన్మించారు. నవమే శ్రీ రామనవమి. శ్రీ రామనవమి రోజే శ్రీ సీతారాముల కళ్యాణాన్ని జరపడమనేది సంద్రపాయంగా వస్తోంది.శ్రీ సీతారాముల పెళ్లి అభిజిత్ లగ్నంలో జరుగుతుంది. శుక్రవారం జరుగబోయే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివార్ల దేవాలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైయ్యింది. వేములవాడ వేలుపు రాజరాజేశ్వరుడే అయినా.. ఇక్కడ మత సామరస్యం వెళ్లివిరుస్తూనే ఉంది. రాజన్న గుళ్లో శైవ, వైష్ణవ ఆలయ సముదాయాలతో పాటు మహ్మదీయ దర్గా కూడా ఉండటంతో వేములవాడ మత సామరస్యానికి తోడు, నీడగా నిలుస్తోంది. ఇక్కడ శ్రీ సీతా రామ కళ్యాణం మహోత్సవం ఆనాదిగా అత్యంత శోభాయమనంగా, వైభవోపేతంగా జరుగుతున్నాయి. శివపార్వతులు ఈ దివ్యకళ్యాన్ని వచ్చి తిలకించి దేవుడినే పెళ్లాడటం మరో విశేషం.