తెలంగాణ

జిఎస్‌టి రాజ్యాంగబద్ధమేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 14: వస్తు సేవా పన్ను (జిఎస్‌టి) రాజ్యాంగబద్దమేనా అంటూ కేంద్ర ప్రభుత్వం, జిఎస్‌టి కౌన్సిల్, తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు గురువారం నోటీసులు జారీ చేసింది. జిఎస్‌టి చెల్లుబాటుపై దాఖలైన పిటీషన్‌పై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ ఎం. శంకర్‌నారాయణలతో కూడా డివిజన్ బెంచ్ కేసు విచాచరణ ప్రారంభించింది. న్యాయవాదులు ఎస్. రాజ్‌కుమార్, జి. నగేష్‌తో పాటు మరొక అడ్వకేట్ పిటీషన్ దాఖలు చేస్తూ, జిఎస్‌టి రాజ్యాంగబద్దమో కాదో ప్రకటించాలని కోరారు. బషీర్‌బాగ్‌లోని కామత్‌హోటల్‌కు తాము స్వాతంత్య్ర దినోత్సవం రోజు వెళ్టి టిఫిన్ (బ్రేక్‌ఫాస్ట్) చేశామని, ఒకే టిఫిన్‌పై సెంట్రల్ జిఎస్‌టి, స్టేట్ జిఎస్‌టి అంటూ పన్ను వేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. రాజ్యాంగానికి జరిగిన 101 వ సవరణ ప్రకారం సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ చట్టం, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ చట్టం, తెలంగాణ స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ చట్టం-2017 రాజ్యాంగ వౌలిక సూత్రాలకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. పిటీషనర్ల వాదనలు విన్న హైకోర్టు నోటీసులు జారీ చేస్తూ అఫిడవిట్లు దాఖలు చేయాలంటూ ఆదేశించింది.