తెలంగాణ

ప్రతి పల్లెకు ఆర్టీసీ బస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, ఏప్రిల్ 14: తెలంగాణలోని ప్రతిపల్లెకు ఆర్టీసీ బస్సు నడిపించే విధంగా రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నుండి ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్తూ మార్గమధ్యంలోని నల్లగొండ జిల్లా సూర్యాపేటలో ఆయన కొంతసేపు ఆగారు. ఈ సందర్భంగా స్థానిక రహదారి బంగ్లాలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని గ్రామాలకు బిటిరోడ్లు నిర్మిస్తోందని, అందువల్ల అన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడిపిస్తామన్నారు. ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆర్టీసీని బలోపేతం చేసేలా ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రత్యేక చొరవ చూపుతున్నారని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత నష్టాల్లో ఉన్న ఆర్టీసీ లాభాల బాటపడుతోందని, ఈ దిశగా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోందన్నారు. ఆర్టీసీ ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషిచేస్తున్నట్లు చెప్పారు. కొత్తగా 650 బస్సులను కొనుగోలు చేస్తున్నామని, ఇందులో 500 బస్సులు ఇప్పటికే సిద్ధమైనట్లు పేర్కొన్నారు. వీటిలో 400 పల్లెవెలుగు, 100 ఎసి బస్సులు ఉన్నట్లు చెప్పారు. ప్రతి నియోజకవర్గకేంద్రం నుండి రాజధాని హైదరాబాద్‌కు ఎసి బస్సును ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. మరో 150 ఎసి బస్సులను సిద్ధం చేసి సుదూర ప్రాంతాలు, పర్యాటక కేంద్రాలు, పుణ్యక్షేత్రాలకు వీటిని నడిపిస్తామన్నారు. మినీ బస్సుల నిర్వహణ వల్ల సంస్థకు నష్టాలు వస్తున్నందున హైదరాబాద్‌కే పరిమితం చేయడంతో పాటు హైదరాబాద్ నుండి యాదాద్రి వరకు మినీ బస్సులను నడిపించనున్నట్లు చెప్పారు. రాష్టవ్య్రాప్తంగా ఉన్న అన్ని ఆర్టీసీ బస్టాండ్‌లో గ్రీనరీలను ఏర్పాటు చేసి బస్టాండ్ పరిసరాలను ఆహ్లాదంగా తీర్చిదిద్దుతామన్నారు. అదేవిధంగా రాష్టవ్య్రాప్తంగా ఉన్న అన్ని చెక్‌పోస్టుల వద్ద సిసి కెమెరాలను ఏర్పాటు చేసి భద్రతను పటిష్టం చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.