తెలంగాణ

దళితులను మంత్రివర్గంలోకి తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 14: తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గంలో దళితులను తీసుకోకుండా ముఖ్యమంత్రి కెసిఆర్ దళితులను అవమానపరుస్తున్నారని టిటిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. జూన్ 2లోగా మంత్రి వర్గాన్ని విస్తరించి దళితులను మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గురువారం ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా పలువురు వక్తలు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ అంబేద్కర్‌కి నివాళులర్పించి ప్రసంగించారు. చాయ్ వాలాగా జీవితాన్ని ఆరంభించిన మోదీ దేశానికి ప్రధాని అయ్యారంటే అది అంబేద్కర్ రాజ్యాంగపరంగా ఇచ్చిన అవకాశమని అన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క దళితుడు కూడా మంత్రివర్గంలో లేక పోవడమంటే దళితులను అవమానించడమేనని అన్నారు. తమ పార్టీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడు అంబేద్కర్‌ను గౌరవిస్తూ 125 అడుగుల విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేయడాన్ని అభినందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో టిటిడిపి కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి సుజనాచౌదరి, ఎమ్మెల్సీ టి.డి.జనార్థనరావు, జాతీయ అధికార ప్రతినిధి ఇ.పెద్దిరెడ్డి, తెలుగు మహిళ అధ్యక్షురాలు బండ్రు శోభారాణి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బొట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి వర్గంలో దళితులను మంత్రులుగా ఈ ఏడాది జూన్ 2 నాటికి తీసుకోకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని టిటిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దళితులను మంత్రివర్గంలోకి తీసుకోనందుకు నిరసనగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎన్టీఆర్ ఘాట్ వద్ద మోత్కుపల్లి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టిటిడిపి నేతలు మోత్కుపల్లి, ఎల్.రమణ, రేవంత్‌రెడ్డి తదితరులు మాట్లాడుతూ తెలంగాణలో దళిత వ్యతిరేక పాలన జరుగుతోందని అన్నారు.
అంబేద్కర్ ఆశయాన్ని స్పూర్తిగా తీసుకుని దళితులు, బడుగులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం వారిని అన్ని విధాల అణచివేసే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. మంత్రివర్గంలో ఒక్క దళితులు కూడా లేకపోవడమే ఇందుకు నిదర్శనమని వారు తెలిపారు. కెసిఆర్ దురంహకారంతో దళితులను చిన్నచూపు చూస్తున్నారని అన్నారు.