తెలంగాణ

యోగా చాంపియన్‌కు రూ.5లక్షల నజరానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 14: అంతర్జాతీయ యోగా ఛాంపియన్ షిప్ సాధించిన దళిత విద్యార్థి సుందర్‌రాజ్‌కు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు రూ. 5 లక్షల చెక్‌ను అందజేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఐమాక్స్ థియేటర్ వద్ద గురువారం జరిగిన బహిరంగ సభావేదికపై సుందర్‌రాజ్‌ను ముఖ్యమంత్రి అభినందించారు. తెలంగాణ కీర్తిని విశ్వవ్యాప్తం చేసాడని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా సుందర్‌రాజ్ తండ్రిని ముఖ్యమంత్రి శాలువ కప్పి సత్కరించారు. ఇలా ఉండగా హిందీ నుంచి తెలుగులోకి అనువదించిన ‘తెలంగాణ ఆందోళన-గాంధీవాదం పునఃస్థాపన’ పుస్తకాన్ని రచయిత రాంజీసింహ ఉదయన్ గురువారం సీఎంకు అందజేశారు. తెలంగాణ ఉద్యమాన్ని కెసిఆర్ నడిపించిన తీరు, ఉద్యమ నాయకునిగా కెసిఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష, తదనంతర పరిణామాలపై ఈ పుస్తకంలో రచయిత వివరించారు.