తెలంగాణ

పేదింటి పాపకు ప్రాణదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 17: హృద్రోగంతో బాధపడుతున్న ఓ పేదింటి పసిబిడ్డకు అండగా నిలిచి ప్రాణాలు కాపాడి మంత్రి హరీశ్‌రావు దయార్ద్ర హృదయన్ని చాటుకున్నారు. మెదక్ జిల్లా తుఫ్రాన్‌కు చెందిన ఏడు సంవత్సరాల సిందె అక్షయ పుట్టుకంతోనే గుండె సంబంధమైన వ్యాధితో బాధపడుతుంది. పాప తండ్రి కడు పేదరికంతో ఉండటంతో ఆ పాపకు చికిత్స చేయించుకునే స్థోమత లేక తనను ఎవరైనా ఆదుకోవాలని సామాజికమాద్యమాల ద్వారా వేడుకున్నాడు. దీనిపై స్పందించిన మంత్రి హరీశ్‌రావు పాప గుండెకు చికిత్స చేయడానికి నాలుగు లక్షలు ఖర్చు అవుతుందని తెలుసుకొని ఆ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇప్పించి కేర్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. దీంతో పాపకు విజయవంతంగా చికిత్స చేసి ప్రాణాపాయస్థితి నుంచి కాపాడారు. మంత్రి హరీశ్‌రావు స్పందించడం వల్లనే పాప తమకు దక్కిందని పాప తండ్రి చంద్రం మంత్రిని కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.