తెలంగాణ

దళితులకు కెసిఆర్ ద్రోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 14: టిఆర్‌ఎస్ ప్రభుత్వం దళితులకు మోసం చేసిందని, తమ పార్టీ అధికారంలోకి వస్తే దళిత నేతను ముఖ్యమంత్రిని చేస్తానని హామీ ఇచ్చి తుంగలో తొక్కారని టిపిసిసి అధ్యక్షులు ఉత్తంకుమార్ రెడ్డి విమర్శించారు. గాంధీభవన్‌లో గురువారం అంబేద్కర్ జయంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ, రాష్ట్రప్రభుత్వం తలపెట్టిన 125 అడగుల ఎత్తు అంబేద్కర్ విగ్రహం నిర్మాణం ప్రతిపాదనను స్వాగతించారు. ఈ విగ్రహం నిర్మించి దళితులకు తాను చేసిన పాపాలను కడుక్కుందామని కెసిఆర్ ప్రయత్నించినా ప్రజలు క్షమించరన్నారు. దళితుల సంక్షేమానికి 50వేల కోట్ల నిధులు ఖర్చు పెడుతామని హామీ ఇచ్చిన రాష్ట్రప్రభుత్వం చేతల్లో ఏమీ చేయడం లేదన్నారు. ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాల భూమి ఇస్తామన్న హామీ విఫలమైందన్నారు. దళిత ఉపముఖ్యమంత్రి డాక్టర్ టి రాజయ్యను పదవి నుంచి తొలగించారన్నారు. హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో రోహిత్ అనే విద్యార్ధి ఆత్మహత్య చేసుకుంటే రాష్ట్రప్రభుత్వం స్పందించలేదన్నారు. యూనివర్శిటీ విసి అప్పారావును రీకాల్ చేసే విషయమై ప్రధానమంత్రితో మాట్లాడుతానని ఇచ్చిన హామీ ఏమైందని ఆయన కెసిఆర్‌నరు నిలదీశారు.