తెలంగాణ

మహిళా బిల్లు ఆమోదించడమే అంబేద్కర్‌కు అసలైన నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 14:పార్లమెంటులో మహిళా బిల్లు ఆమోదం పొందినప్పుడే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్‌కు నిజమైన నివాళి అర్పించినట్టు అని నిజామాబాద్ ఎంపి కవిత అన్నారు. 125వ జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్ వద్ద నున్న అంబేద్కర్ విగ్రహానికి గురువారం ఆమె పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఫోటో ప్రదర్శన తిలకించారు. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమన్న అంబేద్కర్ ఆలోచనను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని అన్నారు. మహిళా బిల్లుకూడా పార్లమెంటులో ఆమోదం పొందాల్సిన అవసరం ఉందని అన్నారు. అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అప్పటి ప్రభుత్వంపై వత్తిడి తీసుకు వచ్చినట్టు చెప్పారు. తెలంగాణ ఏర్పాటు అయ్యాక ముఖ్యమంత్రి కెసిఆర్ 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహానికి శంకుస్థాపన చేయడం సంతోషకరమని అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని అన్నారు. తెలంగాణ జాగృతి ఏడాది పొడవునా కార్యక్రమాలను నిర్వహిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, ఖైరతాబాద్ కార్పొరేటర్ పి విజయారెడ్డి, తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షుడు రాజీవ్ సాగర్ పాల్గొన్నారు.