తెలంగాణ

ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 19: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు అధికారులు తగు చర్యలు చేపట్టారు. ఈ మేరకు మంగళవారం సైబరాబాద్ కమిషనరేట్‌లోని ప్రధాన కాన్ఫరెన్స్ హాలులో జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఏ, టిఎస్పీడీసిఎల్, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు సమన్వయ సమావేశం నిర్వహించారు. జిహెచ్‌ఎంసి జోనల్ కమిషనర్ హరిచందన, ట్రాఫిక్ డిసిపి శ్రీనివాస్ పాల్గొన్న ఈ సమావేశంలో వివిధ అంశాలు చర్చకు వచ్చాయి. ఈ సందర్భంగా సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి ఏఆర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, రోడ్డ అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. వాహనదారులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. ఎక్కువగా ట్రాఫిక్ జాం అయ్యే జంక్షన్లను గుర్తించాలని, రోడ్లను ఆక్రమించి వ్యాపారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం జిహెచ్‌ఎంసి జోనల్ కమిషనర్ హరిచందన మాట్లాడుతూ జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఏ, డిఎస్పిడిసిఎల్, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో పనిచేస్తే ట్రాఫిక్ సమస్యలు సత్వరమే పరిష్కారమవుతాయన్నారు. జిహెచ్‌ఎంసి జోనల్ కమిషనర్ హరిచందనతోపాటు ట్రాఫిక్ డిసిపి శ్రీనివాసరావు, కూకట్‌పల్లి ట్రాఫిక్ ఏసిపి పి అశోక్, మాదాపూర్ ఏసిపి రమణకుమార్, ఇతర అధికారులతోపాటు గచ్చిబౌలి సిఐ చంద్రకాంత్, ఆర్‌ఐ తోట శ్రీనివాసరావు, ట్రాఫిక్ అడ్మిన్ ఇన్స్‌పెక్టర్ రామచంద్రరావు, మాదాపూర్ ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్ నర్సింగ్‌రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.