తెలంగాణ

హోం గార్డుల జీవితాలతో చెలగాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 19: హోం గార్డుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతున్నదని టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్ రెడ్డి విమర్శించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ప్రాంతానికి చెందిన హోం గార్డు జంగం శివకుమార్ చాలీచాలని వేతనంతో, సిఎం ఇచ్చిన హామీ నెరవేరక ఇక తమ బతుకులు బాగపడవన్న మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న శివకుమార్ కుటుంబ సభ్యులకు 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తూ మంగళవారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మీ పార్టీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న హామీలను పక్కన పెట్టారని ఆయన తెలిపారు. ఔట్‌సోర్సింగ్ లేదా ఇతర పేర్లతో ఉద్యోగులను దోచుకోవడాన్ని వ్యతిరేకిస్తామని, వారందరినీ శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. అప్పట్లో ఇందిరా పార్కు వద్ద జరిగిన హోం గార్డుల ధర్నాలో పాల్గొన్న మీరే స్వయంగా హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. నడి రోడ్డులో నిలబడి ట్రాఫిక్ నియంత్రణ డ్యూటీ నిర్వహిస్తున్న హోం గార్డులను ఆదుకోవాలని ఆయన కోరారు. పదోన్నతుల్లో పోలీసులతో సమానంగా అవకాశాలు కల్పించాలని, పోలీసులతో సమానంగా ఆరోగ్య భద్రత, వైద్య సౌకర్యం కల్పించాలని, హోంగార్డుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని తదితర డిమాండ్లను సిఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు.