తెలంగాణ

పాలీహౌస్‌లకు రూ.50 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 19: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించేందుకు, సాగునీటిని పొదుపుగా వాడుకునేందుకు, పంటల ఉత్పత్తి గణనీయంగా పెంచేందుకు వీలుగా ప్రభుత్వం పాలీహౌస్‌ల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పాలీహౌస్’ లకోసం 50 కోట్ల రూపాయలను ఈ సంవత్సరానికి తాజాగా విడుదల చేసింది. పాలీహౌస్‌ల ద్వారా కాయగూరల పెంపకాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని రెండేళ్ల క్రితమే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిది.
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు స్వయంగా రైతుకావడంతో ఆయన పాలీహౌస్ విధానంలో పంటల ఉత్పత్తులను చేపట్టారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టక పూర్వమే ఆధునిక విధానాల్లో సేద్యం చేస్తూ వస్తున్నారు. పాలీహౌస్‌ల ద్వారా ఎకరాకు కోటి రూపాయలు సంపాదించవచ్చని నిరూపించారు. వ్యవసాయ శాస్తవ్రేత్తలను, మీడియా ప్రతినిధులను తీసుకువెళ్లి తన వ్యవసాయ క్షేత్రాన్ని చూపించారు. విదేశాలకు ఎగుమతి చేసేందుకు వీలుగా రంగుల్లో ఉండే క్యాప్సికం తదితర కాయగూరల పెంపకాన్ని ఆయన పెద్దఎత్తున చేపట్టారు. దాంతో రైతులకు ఆదర్శంగా నిలిచారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత పాలీహౌస్‌లకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, యాదాద్రి, నల్లగొండ, నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్, మేడ్చల్, వికారాబాద్ తదితర జిల్లాల్లో రైతులు పాలీహౌస్‌లను నిర్మించుకునేందుకు ముందుకు వస్తున్నారు. దాంతో ప్రభుత్వం పెద్దఎత్తున ఈ విధానాన్ని ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా 2017-18 ఆర్థిక సంవత్సరానికి దాదాపు 1000 ఎకరాల్లోపాలీహౌస్‌లకోసం 50 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ప్రస్తుతం రైతులకు చెల్లించాల్సిన మొత్తంలో 50 కోట్లు కాకుండా మరో 16.17 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ నిధులను కూడా త్వరలోనే విడుదల చేస్తామని అధికార యంత్రాంగం తెలిపింది.