తెలంగాణ

ప్రజలకు గవర్నర్ బతుకమ్మ శుభాకాంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 19: బతుకమ్మ పండగ సందర్భంగా తెలంగాణ ప్రజలకు గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్‌భవన్ అధికారులు ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ సంస్కతీ, సాంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీకగా నిలుస్తుందని గవర్నర్ పేర్కొన్నారు. వేర్వేరు రంగులు, రకరాల పూలను మహిళలు సేకరించి అందంగా తీర్చిదిద్దుతారన్నారు. తంగేడుపూలు, గునుకపూల, బంతి, చామంతి, నందివర్దనం తదితర పూలను ఇందుకోసం ఉపయోగిస్తారన్నారు. బతుకమ్మ దేవతను పూలతోపూజిస్తారని, ప్రజల ఆరోగ్యం బాగుండాలని, సుఖసంతోషాలతో జీవించాలని వేడుకుంటారని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలంతా సంతోషంగా బతుకమ్మ పండగను జరుపుకోవాలన్నారు.
ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కూడా బతుకమ్మ పండగ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని, ఆనందంగా బతుకమ్మ పండగ జరుపుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత బతుకమ్మ పండగకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందన్నారు. బతుకమ్మ పండగ సందర్భంగా పేద మహిళలకు చీరలపంపిణీతోపాటు ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని గుర్తుచేశారు.